క్రైమ్‌

ప్రేమ పేరుతో లక్షలు లాగిన కిలాడి దంపతులు..!

ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్ల ఎక్కువయ్యారు. అమాయకులను ఆసరాగా చేసుకొని వారి దగ్గర నుంచి లక్షలకు లక్షలు దోచుకుంటున్నారు. ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాలను సృష్టించి ప్రేమపేరుతో కొందరి అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు. మరికొందరిని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తూ వారి దగ్గర లక్షల డబ్బులను లాగుతున్న ఓ కిలాడీ జంటను చివరికి పోలీసులు అరెస్టు చేసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గికి చెందిన పొన్నం నవీన్‌కుమార్‌, భార్య శిరీషతో కలిసి లింగంపల్లిలో నివసిస్తున్నారు వీరికి మూడు నెలల వయసున్న పాప ఉంది. ఈ క్రమంలోనే నవీన్ కుమార్ ఒక మెడికల్ షాప్ లో క్యాషియర్ గా పని చేస్తున్నారు. అయితే అక్కడ వచ్చే జీతం సరిపడకపోవడంతో ఈ విధమైనటువంటి మోసాలకు తెరలేపారు.ఈ క్రమంలోనే శ్వేతా అనే పేరుతో ఫేస్ బుక్ లో ఒక నకిలీ ఖాతాను సృష్టించారు.యువకులకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపించారు. నగరానికి చెందిన ఓ బాధితుడు వీరి వలలో చిక్కాడు. ఆదాయపు పన్నుల శాఖలో ఉద్యోగాలు ఉన్నాయని ఆ యువకుడికి మాయమాటలు చెప్పి సుమారు 8 లక్షల వరకు డబ్బులు లాగారు.

అదేవిధంగా ప్రేమ వల వేసి మరోక యువకుడి దగ్గర రూ.2.50 లక్షలు బదిలీ చేయించుకుంది. జూబ్లీహిల్స్‌కు చెందిన మరొకరిని మోసం చేసి రూ.2 లక్షల గుంజింది. ఈ విధంగా అందరి దగ్గర లక్షల్లో డబ్బులను లాగి ఉన్నఫలంగా ఫోన్ ఆఫ్ చేయడంతో బాధితులు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా వారిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే వారిపై ఇదివరకే రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్లలోనూ కేసులున్నాయని తెలియడంతో పోలీసులు నవీన్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. అదేవిధంగా వీరికి మూడు నెలల పాప ఉండడంతో శిరీషకు పోలీసులు నోటీసు ఇచ్చి పంపారు.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM