ఆన్‌లైన్ గేమ్స్ అనేవి పెద్దలే కాదు పిల్లల ప్రాణాలు కూడా తీస్తున్నాయి. వాటి బారిన పడి ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ బాలుడు ఓ ఆన్‌లైన్ గేమ్ బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆ విషయం తెలిసిన తల్లి తిట్టే సరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని ఛతర్‌పూర్ జిల్లాకు చెందిన 13 ఏళ్ల కృష్ణ అనే బాలుడు స్థానికంగా ఉన్న నీవ్ అకాడమీలో 6వ తరగతి చదువుతున్నాడు. అతను ఫ్రీ ఫైర్ అనే స్మార్ట్ ఫోన్ గేమ్‌కు బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే తన తల్లి అకౌంట్ నుంచి రూ.40వేలను ఖర్చు చేసి ఆన్‌లైన్ లో ఆ గేమ్‌లో పోటీ పడ్డాడు. కానీ అతను గేమ్ లో ఓడిపోవడంతో ఆ రూ.40వేలు పోయాయి.
అయితే విషయం తెలుసుకున్న కృష్ణ తల్లి అతన్ని తిట్టింది. దీంతో అతను ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను ఓ సూసైడ్ నోట్‌ను కూడా రాశాడు.
సారీ.. అమ్మా.. మీకు అమర్యాద కలిగించాను. గేమ్ లో రూ.40వేలు పోయాయి. సారీ.. ఏడవకు.. అని ఓ నోట్ రాశాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కృష్ణ తల్లి స్థానికంగా ప్రభుత్వ హాస్పిటల్‌లో ఆరోగ్య సిబ్బందిగా పనిచేస్తుండగా.. తండ్రి ఓ పాథాలజీ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. ఆ విధంగా అతను ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై డబ్బులు పోగొట్టుకుని ఆ మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…