పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ఎంతో హ్యాపీగా ఫీలవుతోంది. ఇక పవన్ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. చాలా రోజుల తరువాత ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించి పవన్ ఆయన అభిమానులనే కాదు, సినీ ప్రేక్షకులందరినీ మెప్పించారు. ఇక ఈ మూవీలో కోర్టు సీన్‌లో భాగంగా వచ్చిన సూపర్ వుమన్ సరళ పాత్ర ప్రేక్షకులందరినీ ఎంతగానో ఎంటర్‌టైన్ చేసింది.
కోర్టు సన్నివేశంలో సరళాదేవి అనే ఎస్ఐని లాయర్‌గా పవన్ విచారిస్తారు. ఆ సీన్‌లో ఆయన డైలాగ్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. పవన్ అడిగే ప్రశ్నలకు ఆమె జవాబులు చెప్పడం, పవన్ మళ్లీ వాటికి కౌంటర్ ఇవ్వడం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆ సీన్లలో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వారు. అయితే సరళాదేవి పాత్రలో నటించిన ఆ నటి పేరు లిరీష. కోర్టు సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఆమె పవన్ ఎదురుగా ఉండి డైలాగ్‌లు చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యిందో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది.
కోర్టు సీన్‌లో పవన్ ఎదురుగా నిలబడాలంటేనే తనకు భయం వేసిందని ఆమె తెలిపింది. పవన్ చెబుతున్న డైలాగ్‌లకు తనకు ఒకానొక దశలో మాటలు రాలేదని, అయితే కట్ చెప్పాక పవన్ తనకు సర్ది చెప్పారని, ఇబ్బంది పడొద్దని అన్నారని, నటించాలని ప్రోత్సహించారని ఆమె తెలిపింది. కోర్టు సన్నివేశంలో ఒక దశలో తాను డైలాగ్‌లు మర్చిపోయానని, ఆ సమయంలో పవన్‌నే చూస్తుంటే ఆయన ఎందుకమ్మా అలా గురాయించి చూస్తున్నావ్ అన్నారని తెలిపింది. అయితే ఆయన ఆ డైలాగ్ స్క్రిప్ట్‌లో లేదని, అప్పటికప్పుడు అనేశారని, కానీ సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఆ డైలాగ్‌ను బాగా ఎంజాయ్ చేశారని ఆమె తెలిపింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…