సాధారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ లు చేస్తుంటారు. ఈ విధంగా ఎంతో మంది బిజినెస్ లో సక్సెస్ అవుతుంటే మరికొంతమంది పెద్ద ఎత్తున మోసపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు నరేష్ కూడా ఒకరు.బిజినెస్ విషయంలో కీస్టోస్ కంపెనీ రూ.7.5 కోట్లు మోసం చేసిందని సీనియర్ నటుడు నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లింగం శ్రీనివాస్ అనే వ్యక్తి కీస్టోన్ ఇన్ఫా కంపెనీల పేరుతో తమ బిల్డర్స్‌తో ఫినిక్స్‌లో అసోసియేట్ అయి సైనింగ్ అథారిటీగా ఉన్నాడని, తన కుటుంబంతో ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉండడంతో 7.5 కోట్లు హ్యాండ్ ఫైనాన్స్ ద్వారా తీసుకుని తిరిగి ఇవ్వలేదని నరేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా గత ఆరు సంవత్సరాల నుంచి అడుగుతున్నప్పటికీ పట్టించుకోవడంలేదు అందుకే సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, ఈ విధంగా తనని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నరేష్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.