అక్కినేని వారి కోడలు హీరోయిన్ సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతూనే పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ గా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత వీరిద్దరూ మొదటి సారి కలిసి నటించిన “ఏమాయ చేశావె ” సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుని తరువాత మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ వంటి సినిమాల్లో నటించారు.
సమంత, నాగ చైతన్య ఇద్దరు కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలోనే ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి 2017లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఇక పెళ్ళైన వెంటనే సోషల్ మీడియా మధ్యమాలలో కూడా తన పేరును సమంత అక్కినేనిగా మార్చేసింది. పెళ్లి తర్వాత సమంత అక్కినేని వారి కోడలిగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తోంది.అయితే ఇప్పుడు సడన్ గా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ‘అక్కినేని’ పేరు తీసివేయడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా సమంత తన పేరును మార్చుకుని అందరికీ షాకిచ్చింది. ఇన్నాళ్లూ తన ఇన్స్టాగ్రామ్ ,ట్విట్టర్ ల ప్రొఫైల్ నేమ్ సమంత అక్కినేని అని ఉండేది. తాజాగా ఆ పేరు స్థానంలో ‘S’ అనే సింగిల్ లెటర్ మాత్రమే కనిపిస్తోంది.ఇది అందరిలో అనేక సందేహాలను రేకెత్తించేలా చేసింది. ఉన్నట్టుండి సమంత ఇలా ఎందుకు చేసిందా అని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. సమంత తాజాగా నటిస్తున్న చిత్రం గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న పౌరాణిక చిత్రం “శాకుంతలం”ఈ మూవీలో సమంత శకుంతల పాత్రలో తొలిసారి పౌరాణిక సినిమాల్లో నటిస్తోంది.