చిరంజీవి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తరువాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని లూసిఫర్ చిత్రం రీమేక్ లో మోహన్ రాజా దర్శకత్వంలో పాల్గొన్నారు. లూసిఫర్ చిత్రంలో మోహన్ లాల్ నటించగా తెలుగులో ఆ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు.
ఇకపోతే ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి తెలుగులో గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ చిత్రబృందం అధికారకంగా టైటిల్ ను ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ షూటింగ్ లో పాల్గొన్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పాన్ ఇండియా తరహలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం చిత్రబృందం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మొదట్లో ఈ పాత్రలో నటించడం కోసం సల్మాన్ ఖాన్ నో చెప్పినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని చిరంజీవి సినిమాలో నటించే అవకాశం రావడంతో సల్మాన్ ఖాన్ ఎంతో సంతోషంగా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమా కోసం డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.