మెగాస్టార్ చిరంజీవి గురించి ఎవరికీ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోనే కాక ఆయన నిజ జీవితంలోనూ హీరోయే అనిపించుకున్నారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఇక సినీ రంగానికి చెందిన తోటి నటీనటులకు సహాయం చేయడంలోనూ చిరంజీవి ఎప్పుడూ ముందే ఉంటారు. అయితే ఇటీవల చిరంజీవితో ఓ సందర్భంలో మాట్లాడిన సాయికుమార్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
నటుడు సాయికుమార్ ఇటీవలే తన షష్టిపూర్తి సందర్భంగా చిరంజీవిని కలిసి మాట్లాడారు. చిరంజీవితో కలిసి ఏదైనా పాత్రలో ఆయన సినిమాలో నటించాలని ఉందని సాయికుమార్ ఆయనను అడిగారు. అందుకు చిరంజీవి బదులిస్తూ.. కొత్తగా ఏదైనా చెయ్యమని చెప్పారని సాయికుమార్ తెలిపారు. అయితే తాను నటిస్తున్న ‘SR కళ్యాణమండపం’ అనే మూవీలో తన పాత్ర వెరైటీగా ఉందని ఆయనకు చెప్పానని సాయికుమార్ తెలిపారు.
కాగా ఆ మూవీని ఆగస్టు 6న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌ను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఆ మూవీ గురించి పలు విషయాలను సాయికుమార్ షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాను చిరంజీవితో మాట్లాడిన మాటల గురించి చెప్పారు. ఇంకా మంచి పాత్రల్లో నటించాలనేదే తన గోల్ అని అన్నారు. ఇక ‘SR కళ్యాణమండపం’ మూవీలో సాయికుమార్ భిన్నమైన పాత్రలో నటించారని, ఆయన రోల్ అందులో హైలైట్ అవుతుందని అంటున్నారు.