సినిమా

రూ.450 కోట్లను సంపాదించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ.. పెట్టిన ఖర్చు వచ్చేసింది..!!

సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కూడా ఒకటి. ఈ ఏడాది అక్టోబర్‌ 13వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు గాను చిత్ర యూనిట్‌ శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. జూనియర్‌ ఎన్‌టీఆర్‌, రామ్‌ చరణ్‌ తేజ, ఆలియా భట్‌, అజయ్‌ దేవగన్‌ వంటి అగ్ర తారలు ఈ మూవీలో నటించారు. సంచలన దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

స్వాతంత్య్ర సమరయోధుల చుట్టూ తిరిగే కల్పిత కథగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆలియా భట్‌ పాత్రకు సీత అని పేరు పెట్టారు. OTTనా, థియేటర్లా అని సినీ నిర్మాతలు ఇబ్బందులు పడుతున్న సమయంలో, పరిశ్రమ కొంత ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న తరుణంలో, ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ఇప్పటికే భారీ మొత్తంలో లాభాలను ఆర్జించింది. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు వెర్షన్లలో విడుదల కానున్న ఈ చిత్రం శాటిలైట్‌, థియేటర్, డిజిటల్ హక్కులను అమ్మడం ద్వారా భారీ మొత్తాన్ని సంపాదించింది. మింట్‌ నివేదిక ప్రకారం ష్యూర్-షాట్ బ్లాక్ బస్టర్ హక్కులను అమ్మడం ద్వారా ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రూ.350 కోట్లను సంపాదించింది.

ఇండియా టుడే నివేదిక ప్రకారం నిజాం ప్రాంతంలో రూ.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.100 కోట్లు, సీడెడ్ జిల్లాల్లో రూ.40 కోట్లు, కర్ణాటకలో రూ .50 కోట్లు వచ్చాయి. లాభాలను పంచుకోవడంలో దర్శకుడికి 50 శాతం వాటా ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీని ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని సంపాదించినట్లు తెలుస్తుంది.

ఇక ఈ చిత్రానికి ఆలియా భట్‌ను ఎంపిక చేయడంపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ అగ్ర నటీనటుల ఎదుట నిలబడి ధైర్యంగా నటించగలిగే సత్తా ఉందని, అందుకే ఆలియాను ఎంపిక చేశామని తెలిపారు. జూనియర్‌ ఎన్‌టీఆర్‌, రామ్‌ చరణ్‌ తేజ అగ్ర నటులు. వారి మధ్య నిలబడి నటించాలంటే అందుకు తగిన నటి అవసరం. అందుకనే ఆలియాను ఎంపిక చేశా.. అని రాజమౌళి అన్నారు. అయితే ఈ మూవీని అంతకు ముందు ప్రేమకథ చిత్రం అని భావించారు. కానీ అది కాదని తరువాత తెలిసింది. మరి చిత్రం ఎలా ఉంటుందన్నది తెలియాలంటే విడుదల అయ్యే వరకు వేచి చూడక తప్పదు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM