సుధీర్ హీరోగా పలాస ఫేమ్ డైరెక్టర్ కరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “శ్రీదేవి సోడా సెంటర్” ఆగస్టు 27న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. గ్రామీణ యువకుడి పాత్రలో సుధీర్ నటన అద్భుతంగా ఉందని పలువురు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే “శ్రీదేవి సోడా సెంటర్” సినిమాను మహేష్ బాబు స్వయంగా హోమ్ థియేటర్ లో చూసి సినిమా ఎంతో అద్భుతంగా ఉందని తెలియజేశారు.
ఈ సినిమాలో నటించిన నటీనటులు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను విజయ తీరం వైపుకు తీసుకెళ్లారని సినిమాపై మహేష్ ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు మరో వ్యక్తి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేజీఎఫ్ లాంటి అద్భుతమైన సినిమాను పరిచయం చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా ఈ సినిమాపై స్పందించారు.
https://twitter.com/prashanth_neel/status/1431520745297887237?ref_src=twsrc%5Etfw
ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ముందుగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను నిర్మించిన తన మిత్రుడు విజయ్ చిల్లాకు అభినందనలను తెలియజేశారు. అదే విధంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు కరుణ్ కుమార్ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ప్రతి ఒక్కరూ కలిసి ఈ సినిమా విజయవంతం కావడానికి కృషి చేశారని చిత్ర బృందంపై దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రశంసలు కురిపించారు.