పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సునామి సృష్టిస్తున్న సంగతి మనకు తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేస్తూ హిట్ టాక్ గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ ఎదురు లాయర్ పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించి ఎంతో సందడి చేశారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు.
వకీల్ సాబ్ సినిమా సాధారణ ప్రేక్షకులను మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలను సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వకీల్ సాబ్ సినిమా చూశారని ప్రకాష్ రాజ్ తెలియజేశారు. కేవలం సినిమా చూడటమే కాకుండా పవన్ కళ్యాణ్ ను హగ్ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారని తెలిపారు.
పవన్ కళ్యాణ్, తారక్ ఈ విధంగా కలవడంతో అటు మెగా అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇద్దరు హీరోల అభిమానులు ఈ ఫోటోను, వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.