టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న జగపతిబాబు కొన్ని రోజులపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా, బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కిన “లెజెండ్” సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే తన రెండవ ఇన్నింగ్స్ హీరోగా కాకుండా విలన్ గా ఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు పలు సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తూ హీరోగా కన్నా విలన్ గానే ఎన్నో మంచి విజయాలను అందుకుంటున్నారు.
నాన్నకు ప్రేమతో, అరవింద సమేత వంటి సినిమాల్లో విలన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న జగపతి బాబు తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో కూడా విలన్ పాత్రలో సందడి చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో జగపతి బాబు రాజ మన్నార్ పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేయడమే కాకుండా అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ఈ క్రమంలోనే జగపతి బాబు రాజ మన్నార్ పాత్రకి సంబంధించిన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో జగపతిబాబు ముక్కుకు నత్తుతో పాటు నోటిలో సిగార్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు తెలియజేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…