బుల్లితెర పైప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.జబర్దస్త్ కార్యక్రమంలో పనిచేస్తున్న మరికొందరు కమెడియన్లు ప్రస్తుతం వెండితెరపై కూడా తమ హవాను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్స్ ట్రా జబర్దస్త్ ద్వారా నవ్వులు పువ్వులు పూయించి అందరినీ ఎంతో ఆకట్టుకున్న కెవ్వు కార్తీక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైకి అందరిని ఎంతగానో నవ్విస్తున్న కార్తీక్ గతంలో ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. ఎన్నో కష్టాలను అనుభవించి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఈ స్థాయిలో ఉన్నానని కార్తీక్ తన గతం గురించి చెప్పుకొచ్చాడు.
టెన్త్ క్లాస్ వరకు సొంతూరిలోనే చదువును కొనసాగించిన కార్తీక ఆ తర్వాత చదువులు చదవలేక పోయానని తెలిపారు.ఈ క్రమంలోనే అప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రావడంతో తాను ఇంజనీరింగ్ పూర్తి చేశానని, ఇంజనీరింగ్ చదువుతూనే కాకతీయ యూనివర్సిటీలో మిమిక్రీలో డిప్లమా చేశా. ఆ తరువాత ఎంటెక్ కూడా చేశానని తెలిపారు. ఈ విధంగా ఇంజనీరింగ్ చదువుతూ పలు స్టేజ్ షోలలో మిమిక్రీ చేస్తూ తన ఖర్చులకు అవసరమయ్యే డబ్బులను సంపాదించుకునే వాడినని తెలిపారు.
తనకు ఇద్దరు అక్కలు ఉండేవారని వారి పెళ్లిళ్లు చేయడం కోసం ఎన్నో అప్పులు చేసి అప్పులు తీర్చడం కోసం ఉన్న ఇంటిని అమ్మడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడినట్లు తెలిపారు.ఎట్టకేలకు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత తనకు మంచి జాబ్ వచ్చిందని అయితే జాబ్ చేయడం తనకు నచ్చకపోవటం వల్ల ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసేవాడినని తెలిపారు. ఒకసారి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో తనకు ట్రైన్లో ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యిందని,వారు తనని ఏం చేస్తుంటావ్ అని అడిగినప్పుడు మిమిక్రీ ఆర్గనైజ్ చేస్తుంది అని చెప్పడంతో కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పాప పుట్టినరోజుకు మిమిక్రీ చేయండని చెప్పారు.
ఈవెంట్ సక్సెస్ కావడంతో నా జర్నీ ఊపందుకుంది. వరుస ఈవెంట్లు చేస్తూ వచ్చా. ఐదారు నెలల్లో బాగా ఫేమస్ అయ్యా. ఈ విధంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ పలు టీవీ కార్యక్రమాలలో అవకాశాలు లభించడంతో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాను అని తన గురించి కార్తీక్ తెలిపారు.