దేశవ్యాప్తంగా కరోనా తీవ్రస్థాయిలో వ్యాపించడంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితులు అయితే అటువంటి వారికోసం సహాయం చేయడానికి తమిళ స్టార్ హీరో సూర్య ముందుకు వచ్చాడు. ఇదివరకే కరోనా కట్టడి చర్యల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి తన తమ్ముడు కార్తీతో కలిసి కోటి రూపాయలను విరాళంగా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.
తాజాగా కరోనా క్లిష్ట పరిస్థితులలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న తన అభిమానులకు సహాయం చేయడానికి ఈ హీరో ముందుకు వచ్చారు. ఎప్పుడు అభిమానులతో దగ్గరగా ఉండే సూర్య ప్రస్తుతం వారు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయి తన ఫ్యాన్స్ క్లబ్ కు చెందిన సుమారు 250 కుటుంబాలకు సహాయం చేశారు. ఒక్కో కుటుంబానికి 5,000 చొప్పున మొత్తం రూ.12.5లక్షల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేసే మరోసారి తన గొప్ప సేవా గుణాన్ని చాటుకున్నారు.
ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితులలో మాత్రమే కాకుండా ఎంతో మంది అనాధ పిల్లలకు అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ఉన్నత చదువులు చదివిస్తు వారి బాధ్యతలను చూసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…