తెలుగు బుల్లితెర పై యాంకర్ గా కొనసాగుతున్న సుమ గురించి మనకు తెలిసిందే. అద్భుతమైన మాట తీరుతో అందరిని ఆకట్టుకునే సుమ పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు ఎంతో బిజీగా ఉన్నారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమాలలో క్యాష్ ప్రోగ్రాం ఒకటి.గత కొన్ని సంవత్సరాల నుంచి అత్యధిక రేటింగ్స్ దూసుకుపోతున్న ఈ కార్యక్రమం ప్రతి వారం ప్రసారం అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే క్యాష్ ప్రోగ్రామ్ ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా క్యాష్ ప్రోగ్రామ్ కి ఈవారం నటి గీతా సింగ్, అంబటి శ్రీనివాస్, బాలాదిత్య, సునీల్ శెట్టి గెస్ట్ గా వచ్చారు. ఎప్పటిలాగే ఈ వారం కూడా సుమ వారితో ఎంతో సరదాగా మాట్లాడుతూ ఆడిపాడారు. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన నటి గీతాసింగ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా కితకితలు ఎవడిగోలవాడిది వంటి సినిమాల ద్వారా బాగా గుర్తింపు సంపాదించుకుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా సుమ గీతాసింగ్ ను ఉద్దేశించి ఈ మధ్య ఎందుకో చాలా బాధపడ్డారంటా అని అడగగా అందుకు స్పందించిన గీతా సింగ్ కాస్త ఎమోషనల్ అయ్యారు… బయటకు ఎక్కడికి వెళ్ళినా నా బాడీ షేమింగ్ పై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని.. అదేవిధంగా మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు.. అని ప్రశ్న తరచూ తనకి ఎదురవుతోందని తెలిపారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను… నా కుటుంబం సంతోషంగా ఉంది. నా పెళ్లి గురించి మధ్యలో మీకెందుకండీ అంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ గా స్పందించే వారిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…