టాలీవుడ్ ఇండస్ట్రీలో వెండితెర చందమామగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్నారు.తాజాగా గత ఏడాది తన చిన్ననాటి స్నేహితులు గౌతమ్ ను పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తన స్పీడ్ తగ్గించకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సరసన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ నాగార్జున సరసన మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అదే విధంగా తమిళంలో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మహిళా ప్రాధాన్యత ఉన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.
కాజల్ అగర్వాల్ జీవితంలోనే ఈ సినిమా ఎంతో విభిన్నమైనదని,డీగ్లామర్ లుక్‌లో సరికొత్త పంథాలో ఆమె ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలిసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను ఓ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితులు కొంత వరకు చక్కబడితే ఈ చిత్రం జూలైలోనే షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలను త్వరలోనే చిత్రబృందం ప్రకటించనున్నారు.