ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా వెండితెరపై సందడి చేసిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామరస్ పాత్ర ద్వారా కుర్రకారును ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుల మతి పోగొడుతోంది. సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ పై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నటిపై పోలీసులు కేసు నమోదు చేయడానికి గల కారణం ఏమిటంటే.. ఈ బ్యూటీ గత నెల 11వ తేదీన పెద్దపల్లి పట్టణంలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యింది. ఈ క్రమంలోనే ఈ మాల్ ప్రారంభోత్సవానికి పాయల్ వస్తుందని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె కరోనా నిబంధనలను పాటించడం లేదని ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
షాపింగ్ మాల్ కార్యక్రమంలో పాల్గొన్న పాయల్ మాస్కు ధరించకుండా, కరోనా నిబంధనలను ఉల్లంఘించిందని ఈ హీరోయిన్ పై పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ నటి పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించని పాయల్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.