బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం ఎంతో అంగరంగ వైభవంగా ప్రసారమైంది. గత రెండు సీజన్లలో మాదిరిగానే ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లను వేదికపైకి ఆహ్వానించి వారందరినీ బిగ్ బాస్ హౌస్ లోనికి పంపించారు. ఈ సీజన్ లో ఎక్కువగా యూట్యూబ్ స్టార్స్, యాంకర్స్, టీవీ ఆర్టిస్టులు ఎంటరయ్యారు.
ఇన్ని రోజులూ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమం ఆదివారం ప్రసారం కావడంతో ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే మన దేశంలో ఎక్కువ మంది రెస్పాండ్ అవుతూ ట్వీట్ చేసిన కార్యక్రమాలలో భాగంగా బిగ్ బాస్ కార్యక్రమం రెండో స్థానంలో నిలబడి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు తెలుగులో ఏ కార్యక్రమం కూడా ఇంతటి అరుదైన రికార్డును సాధించకపోగా, మొట్ట మొదటిసారిగా బిగ్ బాస్ సీజన్ 5 అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
ఇకపోతే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ కార్యక్రమం రాత్రి 10 నుంచి 11 గంటల వరకు ప్రసారం అవుతుంది. శని, ఆదివారాలలో రాత్రి 9 నుంచి 11 గంటల వరకు ప్రసారం అవుతూ ప్రేక్షకులకు రెట్టింపు ఆనందాన్ని ఇవ్వబోతోంది. ఈక్రమంలోనే మొదటిరోజే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ ల గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వీరీలో టైటిల్ పోరులో షణ్ముఖ్ జస్వంత్, రవి ఉంటారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.