డేటింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ సినిమాలు ఏ తరహాలో ఉంటాయో మనకు తెలిసిందే. పూరి సినిమాలలో హీరోలకు ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్, హీరోయిన్ కి డిఫరెంట్ రోల్ ఇచ్చి విభిన్న కథాంశంతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకుడిగా నిర్మాతగా మారిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా చిత్రంగా “లైగర్” అనే సినిమాకు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను చేపడుతున్నారు.
ఇకపోతే “లైగర్” తర్వాత పూరి తన తర్వాత ప్రాజెక్టుగా నందమూరి నటసింహం బాలకృష్ణతో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలకృష్ణకు కథ చెప్పడంతో కథ వినగానే బాగా నచ్చడంతో ఈ సినిమాలో చేయడానికి బాలయ్య బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇడియట్ తరహాలో ఉండబోతోందని తెలుస్తోంది. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఈ కథలో కొడుకు గెలుపు కోసం తండ్రి ఏం చేశాడు అనే లైన్ ఆధారంగా సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం పూరి “లైగర్ ” సినిమాతో బిజీగా ఉండగా.. బాలయ్య బాబు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అఖండ” సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా బాలయ్య బాబు త్విపాత్రాభినయం చేయనున్నారు. అయితే గతంలో పూరి, బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన “పైసా వసూల్”చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా, ప్రేక్షకులలో మాత్రం మంచి క్రేజ్ సంపాదించింది.తరువాత వీరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ ఈ ఏడాది వేసవిలో ప్రారంభం కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…