కరోనా బారిన పడిన వారికి చికిత్సను అందించేందుకు ఆనందయ్య మందును అందజేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వివాదం నెలకొన్నా హైకోర్టు తీర్పుతో మళ్లీ మందు పంపిణీ ప్రారంభమైంది. అయితే ఆనందయ్యకు అన్ని వర్గాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. కానీ కొందరు మాత్రం ఆ మందుపై విమర్శలు చేస్తున్నారు. ఇక ప్రముఖ హేతువాది బాబు గోగినేని ఆనందయ్య మందును చట్నీగా వ్యాఖ్యానించారు. అయితే ఆనందయ్య మందుకు ప్రముఖ నటుడు జగపతి బాబు మద్దతుగా మాట్లాడడంతో బాబు గోగినేని జగపతి బాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఎవడు నమ్మినా.. నమ్మకపోయినా.. నేను నమ్ముతున్నా.. అంటూ గతంలో జగపతి బాబు ఆనందయ్య మందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘ఆయుర్వేదం అనేది తప్పు చేయదు.. శరీరానికి హానిచేయదు. ప్రకృతి, భూదేవి తప్పు చేయవు. ప్రజల్ని కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నా.. ఆనందయ్యని దేవుడు ఆశీర్వదించాలి అంటూ.. జగపతి బాబు గతంలో కామెంట్ చేశారు. దానికి బాబు గోగినేని స్పందించారు.
‘అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ.. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచెం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు’ అంటూ జగపతి బాబుపై బాబు గోగినేని ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు.
అయితే ఇటీవలే జగపతిబాబుపై ఓ ఇంగ్లిష్ వెబ్‌సైట్‌లో వార్త వచ్చింది. ఆయన త్వరలో జూబ్లీహిల్స్‌లో ఓ ఆయుర్వేద హాస్పిటల్‌ను ఓపెన్ చేయబోతున్నారని అందులో ఉంది. ఈ నేపథ్యంలోనే జగపతి బాబు ఆనందయ్య మందుకు మద్దతును ప్రకటించారో, లేదో తెలియదు కానీ.. ఆయన ఆ మందు గురించి పాజిటివ్‌గా మాట్లాడడంతో బాబు గోగినేని విమర్శించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…