స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. పుష్ప సినిమాను రెండు భాగాలుగా చేయడంతో ప్రస్తుతం మొదటి భాగం చివరి దశలో షూటింగ్ జరుపుకుంటుంది. రెండవ భాగం మొదలుపెట్టడానికి కాస్త సమయం పట్టడంతో అల్లు అర్జున్ ఈ లోగా మరికొంతమంది దర్శకులతో మరిన్ని సినిమాలను చేయడానికి ఒప్పుకుంటున్నారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా ఉంటుందనే వార్తలు ముమ్మరంగా వినిపిస్తున్నాయి.నిజానికి “ఐకాన్” సినిమా ఇప్పటికే ఎప్పుడో పూర్తి కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది.తాజాగా వేణు శ్రీరామ్ “వకీల్ సాబ్” సినిమా ద్వారా మంచి విజయం అందుకోవడంతో మరోసారి “ఐకాన్” వార్తల్లో నిలిచింది.
ఈ సినిమా కథను అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకొని దర్శకుడు స్క్రిప్టును పలు మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అల్లు అర్జున్ ఈ సినిమాలో ఒక అంధుడి పాత్రలో నటిస్తున్నారనే సమాచారం బలంగా వినబడుతోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోలు ఈ విధంమైన పాత్రలు చేశారు. కానీ స్టార్ హీరోలు ఎవరు ఈ విధమైనటువంటి ప్రయోగం ఇప్పటివరకు చేయలేదు.కానీ మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ ఈ సినిమాలో అంధుడి పాత్ర ద్వారా సరికొత్త ప్రయోగం చేయనున్నారు. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది లేదా అనేది మాత్రం చిత్రబృందం అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది.అయితే ఇప్పటికే విడుదలైన ఐకాన్ టైటిల్ పోస్టర్ కింద కనిపించడం లేదు అనే క్యాప్షన్ ఇవ్వడంతో ఇది హీరో పాత్రకు అనుగుణంగానే ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ సరికొత్త ప్రయోగం అల్లు అర్జున్ కు సరైన ఫలితాలను ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే.