సీనియర్ నటి గౌతమి ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి, ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దక్షిణాది తెలుగమ్మాయిగా విశాఖపట్నంలో చదువుకుంటూ సినీ నటిగా రంగప్రవేశం చేసి అద్భుతమైన నటన ద్వారా అందరి ప్రశంసలు అందుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న గౌతమి తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి పాల్గొని ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసిన గౌతమి తన సినీరంగ ప్రవేశం, తన కెరీర్లో ఎదుర్కొన్న అనుభవాలను ముచ్చటించారు. ఈ సందర్భంగా అలీ అడిగే పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే అలీ చిరంజీవితో సినిమా అవకాశం వస్తే చేయలేకపోయారు ఆ సినిమా ఏంటి అని అడగగా అందుకు గౌతమి సమాధానం చెబుతూ…
చిరంజీవితో నటించే అవకాశం ఒకటి కాదు రెండు సినిమాలు వచ్చినా కూడా అతనితో చేసే అవకాశం కుదరలేదు.కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే సుబ్బరామిరెడ్డి నిర్మాతగా వ్యవహరించిన స్టేట్ రౌడీ చిత్రంలో చిరంజీవితో కలిసి నటించలేకపోయాను. ఆ సమయంలో రజనీకాంత్ తో సినిమా చేయటం వల్ల చిరంజీవితో సినిమా చేయడం కుదరలేదు అంటూ అప్పటి సన్నివేశాలను గౌతమి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు