కరోనా కారణం వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కారు. ఈ క్రమంలోనే నటి ప్రణీత కూడా ఎవరికీ తెలియకుండా వివాహబంధంతో ఒక్కటై అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి మనకు తెలిసిందే. నటి ప్రణీత బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త,చిన్ననాటి స్నేహితుడు, నితిన్ రాజును మే 31న పెళ్లి చేసుకున్నారు.
ఈ క్రమంలోనే వీరి పెళ్లికి హాజరైన ఓ స్నేహితుడు వీరు పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలోనేపెళ్లి తర్వాత మొట్ట మొదటిసారిగా స్పందించిన నటి ప్రణీత ఎట్టకేలకు తను రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణాన్ని బయటపెట్టారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రణిత తన పెళ్లి రహస్యంగా చేసుకోవడం గురించి తెలిపారు. ప్రస్తుతం కరోనా తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలోనూ, ఆషాడ మాసం దగ్గరగా ఉండడం వల్ల తన పెళ్లిని ఎంతో ఘనంగా కాకుండా నిరాడంబరంగా జరుపుకోవాలని భావించడం వల్లే తన పెళ్లి చేసుకుంటున్న సంగతి ఎవ్వరికీ తెలియకుండా చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం దేశం మొత్తం ఎంతో సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో తన పెళ్లి ఆడంబరంగా జరుపుకోవడం సరికాదని భావించడం వల్లే ఇలా చేసుకున్నానని ప్రణీత అసలు విషయం బయట పెట్టారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…