సెలబ్రిటీలు సోషల్ మీడియాలో నిత్యం తమ అప్‌డేట్స్ గురించి పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటారు. వారు ఏ పని చేసినా దానికి సంబంధించిన ఫొటోలను లేదా వీడియోలను, టెక్ట్స్ సందేశాలను సోషల్ మీడియాలో పెడుతుంటారు. అయితే అంతా బాగానే ఉంటుంది, కానీ కొన్నిసార్లు సీన్ రివర్స్ అవుతుంది. వారు చేసే పనులను చాలా మంది వ్యతిరేకిస్తుంటారు. బిగ్‌బాస్ హిందీ ఫేమ్, నటి అర్షి ఖాన్ ఇటీవల వినాయక చవితి సందర్భంగా తన ఇంట్లో గణేషుడికి పూజలు చేసి ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు.
అర్షిఖాన్ ముస్లిం అయి ఉండి హిందువుల పండుగను ఎలా జరుపుకుంటుందంటూ అనేక మంది ఆమెను ట్రోల్ చేస్తూ విమర్శించారు. అయితే వాటికి అర్షిఖాన్ గట్టిగానే బదులిచ్చింది. తాను ఒక ముస్లింనే అని, కానీ అంతకన్నా ముందుగా ఒక ఇండియన్‌ను అని తెలిపింది.
https://www.instagram.com/p/CTp2o_9IAnE/?utm_source=ig_embed&ig_rid=365191ba-2e7d-43f0-b00b-4c3bf4942ce1
భారతీయురాలిగా తాను అన్ని పండుగలను జరుపుకుంటానని అర్షిఖాన్ తెలిపింది. ఈద్ పండుగకు తన ఇంటికి తన హిందూ ఫ్రెండ్స్ వస్తారని, అందరితో కలిసి పండుగ జరుపుకుంటానని, అందులో భాగంగానే వినాయక చవితికి గణేష్‌కి పూజలు చేశానని తెలిపింది. కానీ ఇది కొందరికి నచ్చడం లేదని, వారు తీవ్రంగా విమర్శిస్తూ తిడుతున్నారని, అలాంటి వారు తనను ఫాలో కావల్సిన పనిలేదని, కామెంట్లు చేయకండి, వెళ్లిపోండి.. అంటూ ఆమె ఘాటుగా, దీటుగా బదులిచ్చింది. కాగా ఆమె చేసిన ఈ పోస్ట్ మళ్లీ వైరల్ అవుతోంది.