Bee Farming: స్వచ్ఛమైన తేనె మనకు మార్కెట్‌లో లభించడం చాలా తక్కువ. ప్యాక్ చేయబడిన తేనె లభిస్తుంది. అయితే తేనెటీగలను పెంచుతూ స్వచ్ఛమైన తేనెను ఉత్పత్తి చేస్తే నిజానికి వ్యాపారం బాగానే సాగుతుంది. స్వచ్ఛమైన తేనెకు మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువే. అందువల్ల తేనెటీగల పెంపకం ద్వారా మనం నెల నెలా బాగానే ఆదాయాన్ని సంపాదించవచ్చు.
తేనెటీగలను పెంచేందుకు పూలతోటలు ఉండాలి. పూలతోటలు దగ్గర్లో ఉండేలా చూసుకుంటే మంచిది. దీంతో తేనెటీగలు వేగంగా తేనెను సేకరిస్తాయి. ఇక పువ్వులు అన్నీ మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉండవు. కనుక ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. పువ్వులు ఏడాది పొడవునా లభించే ప్రాంతాల్లో తేనెటీగలను పెంచాలి. దీంతో తేనె సేకరణకు ఆటంకం ఏర్పడదు.
తేనెటీగలను బాక్సుల్లో పెంచాల్సి ఉంటుంది. ఒక్కో బాక్సుకు సుమారుగా రూ.1000 వరకు ఖర్చు అవుతుంది. ఈ క్రమంలో 50 నుంచి 100 బాక్సులతో మొదట తేనెటీగల పెంపకం చేపట్టవచ్చు. 100 బాక్సులు అయితే ఒక్కో బాక్సుకు రూ.1000 చొప్పున మొత్తం రూ.1 లక్ష పెట్టుబడి అవుతుంది. పువ్వుల తోటలు ఉండే స్థలాన్ని లీజుకు తీసుకోవచ్చు. దీంతో తేనె సేకరణ సులభతరం అవుతుంది. అలాగే ఇతర పరికరాలకు, సామగ్రికి డబ్బులను వెచ్చించాలి. దీంతో రూ.2 లక్షల మేర పెట్టుబడి పెడితే తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించవచ్చు.
తేనెటీగలు సహజంగానే ఒక బాక్సులో తేనెను సేకరించేందుకు సుమారుగా 20 రోజులకు పైగానే సమయం పడుతుంది. అంటే నెల నెలా మనకు తేనె కచ్చితంగా వస్తుంది. ఈ క్రమంలో ఒక్క బాక్సు నుంచి నెలకు సుమారుగా 5 కేజీల వరకు తేనె ఉత్పత్తి అవుతుంది. అదే 100 బాక్సులకు అయితే 500 కేజీల తేనె వస్తుంది.
బయట మనం కిలో తేనెను టోకున అమ్మితే రూ.100 నుంచి రూ.150 వరకు వస్తాయి. కానీ మనమే తేనెను ప్యాక్ చేసి అమ్మితే కేజీకి రూ.400 వరకు సంపాదించవచ్చు. దీంతో 500 కేజీల తేనెకు కిలోకు రూ.400 వేసుకున్నా.. రూ.2,00,000 వస్తాయి. అందులో సగం ఖర్చులు తీసినా సగం మిలుగుతాయి. అంటే రూ.1 లక్ష అన్నమాట. నెలకు ఇలా రూ.1 లక్ష ఆదాయం పొందవచ్చు.
గమనిక: తేనెటీగల పెంపకంపై కేవలం సంక్షిప్త అవగాహన కోసమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల కోసం తేనెటీగల పెంపకం శిక్షణా కేంద్రంలో సంప్రదించవచ్చు. ఈ కేంద్రాలు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఉన్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…