డబ్బు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో ఆన్‌లైన్ వ్యాపారం ఒకటి. మనం ఏదైనా వ్యాపారం చేస్తే.. వస్తువులను అమ్మితే మనకు షాపు ఉంటే అక్కడకు వచ్చే వారికి మాత్రమే వస్తువులను అమ్మగలుగుతాం. కానీ ఆన్‌లైన్‌లో అలా కాదు. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న పౌరులకు అయినా సరే మన వస్తువులను అమ్మవచ్చు. అదీ ఆన్‌లైన్ షాపింగ్ కు ఉన్న ప్రాముఖ్యత. అయితే ఎలాంటి పెట్టుబడి లేకుండా సులభంగా చేయదగిన వ్యాపారం ఒకటి ఉంది. అదే.. ఆన్‌లైన్ లో మామిడి ఆకులను అమ్మడం.
మనకు పండుగలు, శుభ కార్యాలకు కొదువ లేదు. ఎప్పుడూ ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది. శుభ కార్యాలు కూడా జరుగుతూనే ఉంటాయి. అయితే పండుగ అయినా శుభ కార్యం అయినా మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి ఆకులు. మామిడి ఆకులను అలంకరణల కోసం ఉపయోగిస్తారు. అంతే కాదు, పూజల్లోనూ వాడుతారు. కనుక ఆ ఆకులకు ఎంతగానో ప్రాధాన్యత ఉంది.
అయితే కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న పట్టణాలు, నగరాల వల్ల మామిడి ఆకులు సులభంగా లభ్యం కావడం లేదు. కానీ ఆన్‌లైన్‌లో వాటిని కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల మామిడి ఆకులను ఎవరైనా సరే ఆన్‌లైన్ లో అమ్మి సులభంగా డబ్బులు సంపాదించవచ్చు.
దీనికి గాను ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. అమెజాన్‌లో వ్యాపారి అకౌంట్‌ను క్రియేట్ చేసి అందులో మామిడి ఆకులను అమ్మవచ్చు. https://sellercentral.amazon.in/ అనే సైట్‌ను సందర్శిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. అమెజాన్‌లో కొందరు 21 మామిడి ఆకులను రూ.109కి విక్రయిస్తున్నారు.
మామిడి ఆకులు మనకు విరివిగా లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శ్రమ పడకుండానే ఈ ఆకులు దొరుకుతాయి. వాటిని సేకరించి భద్రపరిచి అమ్మవచ్చు. తాజాగా ఉండేలా చూసుకుని అమ్మితే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయి. అమెజాన్‌లో గతంలో కొందరు పిడకలను అమ్మి వ్యాపారం ప్రారంభించారు. కనుక ఈ ఆకులను కూడా అమ్మి వ్యాపారం చేయవచ్చు. అందుకు కావల్సిందల్లా కొద్దిగా శ్రమ.. ఓపిక.. అంతే.. అవి ఉండాలేగానీ మామిడి ఆకులను అమ్ముతూ చక్కని ఆదాయం పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…