ఆటోమొబైల్స్

Vehicle Fuel : వాహ‌నాల్లో ఇంధ‌నం పూర్తిగా అయిపోయే వ‌ర‌కు వాటిని న‌డ‌ప‌కూడ‌దు.. ఎందుకో తెలుసా..?

Vehicle Fuel : వాహ‌నాల‌న్నాక వాటిల్లో పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్‌జీ ల‌లో ఏదో ఒక‌టి నింపాల్సిందే. ఎందుకంటే ఇంధ‌నం లేనిదే ఏ వాహ‌నం న‌డ‌వ‌దు క‌దా. అయితే చాలా మంది ఫ్యుయ‌ల్ చివ‌రి పాయింట్ వ‌చ్చే వ‌ర‌కు న‌డుపుతుంటారు. బైక్‌ల‌లో అయితే రిజ‌ర్వ్ లో ప‌డి చాలా దూరం వెళ్లినా.. కార్ల వంటి 4 వీల‌ర్స్‌లో అయితే ఎరుపు రంగు ఫ్యుయ‌ల్ ఇండికేట‌ర్ లైన్ దాటి కింద‌కు మార్క్ వెళ్లినా ఆగ‌కుండా వెళ్తారు. ఆ.. ఇంకాస్త దూరం వెళ్లాక ఫ్యుయ‌ల్ కొట్టిద్దాంలే అని అనుకుంటారు. అయితే నిజానికి ఫ్యుయ‌ల్ అయిపోతుందంటే అప్పుడు కాక‌పోయినా కొంత దూరం వెళ్లాక‌యిన కొట్టించాల్సిందే క‌దా. కానీ కొంద‌రు అలా చేయ‌రు, ఆల‌స్యం చేస్తారు.

చివ‌ర‌కు ఫ్యుయ‌ల్ కాస్తా అయిపోయాక వాహ‌నాన్ని తోస్తూ పెట్రోల్ పంప్ కోసం చూస్తారు. అయితే స‌రే.. అలా తోసినా ఫ‌రవాలేదు కానీ, నిజానికి ఫ్యుయ‌ల్ అయిపోయే దాకా అలా వాహనాన్ని ఉంచ‌కూడ‌దు. ఫ్యుయ‌ల్ పూర్తిగా అయిపోయేలా వాహ‌నాన్ని న‌డ‌ప‌కూడ‌దు. అలా న‌డిపితే ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాహ‌నాన్ని ఫ్యుయ‌ల్ పూర్తిగా అయిపోయే వ‌ర‌కు న‌డిపితే ఫ్యుయ‌ల్ అయిపోయాక ఆ పైపుల్లో గాలి ఏర్ప‌డుతుంది. అది ఇంజిన్‌పై ప్ర‌భావం చూపుతుంది. దీంతో ఇంజిన్ బాగా వేడెక్కి దాని ప‌నితీరుపై ప్ర‌భావం చూపుతుంది. ఆ క్ర‌మంలో ఇంజ‌న్ పాడైపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. దీంతో ఇంజిన్ రిపేర్ కోసం బాగా ఖర్చు చేయాల్సి వ‌స్తుంది. క‌నుక ఎప్పుడైనా ఫ్యుయ‌ల్ అయిపోయే వ‌ర‌కు వేచి చూడకుండా ముందే వాహ‌నాన్ని రీఫిల్ చేయ‌డం బెట‌ర్.

Vehicle Fuel

కార్లు అయితే ఫ్యుయ‌ల్ మీట‌ర్‌లో ఎరుపు రంగు ఇండికేట‌ర్ లైన్ మార్కు దాట‌కుండా చూసుకోవాలి. ఆ మార్కు దాట‌క‌ముందే ఫ్యుయ‌ల్ రీఫిల్ చేయాలి. ఇక బైక్‌లు అయితే రిజ‌ర్వ్‌లో ప‌డ‌గానే వీలైనంత త్వ‌ర‌గా ఫ్యుయ‌ల్ రీఫిల్ చేయాలి. అంతేకానీ, రిజ‌ర్వ్ లో ఉంది క‌దా, ఇంకా చాలా సేపు వెళ్ల‌వ‌చ్చులే అని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే నిజానికి కారులో లేదా బైక్‌లో లేదా ఇత‌ర వాహ‌నంలో అయినా ఉండే ఫ్యుయ‌ల్ మీట‌ర్లు ఎల్ల‌ప్పుడూ క‌చ్చితత్వంతో ప‌నిచేయ‌వు. ఒక్కోసారి చెడిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక వాటిని న‌మ్మ‌రాదు. ఈ క్ర‌మంలో ఫ్యుయ‌ల్ ను ఎప్ప‌టిక‌ప్పుడు ఫిల్ చేసుకుంటే దాంతో ఇంజిన్ కూడా చెడిపోదు. అన‌వ‌స‌రంగా డ‌బ్బులు వెచ్చించాల్సిన ప‌నిరాదు.

ఇక ప్ర‌స్తుతం వ‌స్తున్న టూవీల‌ర్స్ బీఎస్‌-6 వాహ‌నాలు క‌నుక రిజ‌ర్వ్ అనే ఆప్ష‌న్ ఉండ‌డం లేదు. కానీ ఫ్యుయ‌ల్ రీడింగ్‌లో ఒక‌టి లేదా రెండు పాయింట్లు ఉండ‌గానే పెట్రోల్ కొట్టించ‌డం మేలు. లేదంటే అది ఎప్పుడు అయిపోతుందో తెలియ‌దు. దీంతో స‌మ‌స్య‌ల పాలు కావ‌ల్సి వ‌స్తుంది. అలాగే ఇంజిన్‌పై కూడా ప్ర‌భావం ప‌డుతుంది. క‌నుక వాహ‌నాల్లో పూర్తిగా ఇంధ‌నం అయిపోక ముందే కాస్త ఉండ‌గానే ఇంధ‌నాన్ని నింపించుకోవాలి. దీంతో వాహ‌నం మైలేజీ చ‌క్క‌గా ఇవ్వ‌డ‌మే కాదు.. ఇంజిన్ లైఫ్ కూడా ఎక్కువ‌గా వ‌స్తుంది. అలాగే ఇత‌ర స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. క‌నుక వాహ‌నాల్లో ఫ్యుయ‌ల్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు కొట్టించండి. మ‌రిచిపోవ‌ద్దు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM