Samantha Naga Chaithanya :గత కొన్ని రోజులుగా అభిమానులు ఏదైతే నిజం కాకూడదని భావించారో ఎట్టకేలకు అదే నిజమైంది. గత కొద్ది రోజుల నుంచి సమంత, నాగ చైతన్య విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ విడిపోకూడదని వీరి నుంచి శుభవార్తను ఆశించిన అభిమానులకు చేదు వార్తను తెలియజేశారు. గత కొన్ని రోజుల నుంచి సమంత, నాగ చైతన్య విడిపోతున్నారంటూ వచ్చిన వార్తలపై నాగచైతన్య అధికారిక ప్రకటన చేస్తూ విడిపోతున్నాం అని చెప్పాడు.
అయితే సమంత, నాగ చైతన్యల మధ్య వివాహ బంధానికి బ్రేక్ పడటంతో చాలా మంది అభిమానులు బాధపడుతుండగా మరికొందరు మాత్రం ఇప్పటికైనా మంచి జరిగింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు వీరి విడాకుల విషయంపై స్పందిస్తూ గత కొన్ని సంవత్సరాల నుంచి మీకు పట్టిన దరిద్రం పోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇలా 4 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా గడిపిన ఈ జంట విడాకులతో విడిపోవటం వల్ల అభిమానులు తమదైన శైలిలో వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ జంట విడిపోవటం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం నాగచైతన్య, సమంత విడాకుల విషయంపై చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.