ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సెకండ్ వేవ్ కు సంబంధించి కొత్త లక్షణాలు బయటపడుతున్నాయి. ముందు సారి మాదిరిగా కేవలం దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు మాత్రమే కాకుండా సెకండ్ వేవ్ లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
సెకండ్ వేవ్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో ఎక్కువ మందికి తలనొప్పి, నీరసంతోపాటు, కళ్ళు ఎర్రబడటం, లాగడం వంటి లక్షణాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా కొందరు ఎంత పడుకున్నప్పటికీ కూడా అలసట, నీరసంగా ఉండటం కరోనా లక్షణమేనని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇదివరకు కరోనా వైరస్ కేవలం నోరు,ముక్కు ద్వారా మాత్రమే శరీరంలోకి ప్రవేశించేది. కానీ, ప్రస్తుతం కనుగుడ్డులో నుంచి శరీరంలోకి వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఎవరికైతే కీళ్లనొప్పులు, అలసట,కళ్ళు లాగడం వంటి లక్షణాలు కనిపిస్తాయో అలాంటి వారు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారు. గతంలో వారం రోజులకు కరోనా లక్షణాలు బయటపడే వని, ప్రస్తుతం కేవలం రెండు రోజులకే వ్యాధి లక్షణాలు బయటపడుతున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా వృద్ధులలో కాకుండా 20 నుంచి 35 మధ్య వయసు గల వారికి అధికంగా వ్యాపించడంతో పాటు మరణాల సంఖ్య కూడా అధికంగా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.