టాలీవుడ్ ఇండస్ట్రీలో అందమైన జంటలలో సమంత నాగచైతన్య జంట ఒకటని చెప్పవచ్చు.తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. చైతన్య సమంత జంటగా పలు సినిమాల్లో నటించడమే కాకుండా,పలు యాడ్ లలో నటిస్తూ సందడి చేస్తుంటారు.
తాజాగా ఈ జంట కలిసి ఒక యాడ్ కోసం షూట్ చేశారు.ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో సమంత, నాగచైతన్య సాంప్రదాయమైన దుస్తులు ధరించి ఎంతో అందంగా ఉన్నారు. సమంత వెండి, గులాబిరంగు కాంబినేషన్ లో ఉన్న పట్టు చీరను ధరించి, టెంపుల్ జువెలరీని ధరించగా.. నాగ చైతన్య లేత నీలి రంగు షూట్ వేసుకొని ఎంతో అందంగా ఉన్నారు.
ఈ యాడ్ కు సంబంధించిన షూట్ హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోను సమంత ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ్ స్టోరీ” సినిమాలో నటించారు.అదేవిధంగా సమంత గుణశేఖర్ దర్శకత్వంలో “శాకుంతలం” అనే సినిమాలో నటిస్తున్నారు.