సాధు జంతువులను సహజంగానే క్రూర మృగాలు వేటాడుతాయి. అది సహజమే. ప్రకృతి ధర్మం. అయితే ఇందుకు వ్యతిరేకంగా జరిగితే ఎలా ఉంటుంది ? అబ్బే.. అసలు అది జరుగుతుందా ? సాధు జంతువులు క్రూర మృగాలను ఎక్కడైనా వేటాడుతాయా ? అంటే.. అవును.. వేటాడుతాయి. కోపం వస్తే అవి ఊరుకోవు. ఎదుట ఎంతటి క్రూర మృగం ఉన్నా సరే ఎత్తి కింద పడేస్తాయి. సరిగ్గా ఆ గేదెలు కూడా ఇలాగే చేశాయి.
రెండు గేదెలు ఒక చోట నిలబడి ఉండగా వాటి ఎదురుగా ఇంకో గేదె కూర్చుని ఉంది. కూర్చుని ఉన్న గేదె వెనుక నుంచి ఓ ఆడ సింహం దానిపై దాడి చేసేందుకు యత్నించింది. అయితే ఎదురుగా నిలుచుని ఉన్న గేదెల్లో ఒక గేదె వేగంగా వచ్చి ఆ సింహాన్ని తన కొమ్ములతో గాల్లోకి ఎత్తి కింద పడేసింది. అలా ఆ గేదె రెండు సార్లు చేసింది. దీంతో ఆ సింహం బతుకు జీవుడా.. అంటూ అక్కడి నుంచి పారిపోయింది. ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.
Buffalo asks- "Heads or Tails".. pic.twitter.com/AhCFabi6QB
— The Dark Circle (@Darksidesnature) April 8, 2021
ట్విట్టర్‌లో పోస్ట్ చేయబడిన ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాన్ని ఇప్పటికే చాలా మంది చూశారు. ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. దానికి రక రకాల కామెంట్లను కూడా పెడుతున్నారు.