ఇటీవల 73 సంవత్సరాల బామ్మ వరుడు కావలెను అంటూ పేపర్ ప్రకటన వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రకటన చూసిన 69 ఏళ్ల తాత ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ప్రకటన చూసిన తర్వాత ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. వీరిద్దరి అభిప్రాయాలు కలవడంతో త్వరలోనే వీరి పెళ్లి పిల్లల సమక్షంలో జరగనుంది.
కర్ణాటకలోని మైసూరు నగరంలో ఉపాధ్యాయురాలిగా పదవీ విరమణ పొందిన 70 సంవత్సరాల బామ్మకు తన భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే ఈ వయసులో తనకు తోడు అవసరం అంటూ తన పిల్లలు తన పెళ్ళికి ఒప్పించారు. ఈ క్రమంలోనే వరుడు కావలెను అంటూ పేపర్ ప్రకటన ఇచ్చారు.
ఇది చూసిన 69 ఏళ్ల రిటైర్డ్ ఇంజనీర్ ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. ఏడు సంవత్సరాల క్రితమే తన భార్య చనిపోయిందని ఆమెకు తెలియజేశాడు.వీరిద్దరి మనసులు కలవడంతో వీరి పెళ్లికి పిల్లలు అంగీకారం తెలిపారు. త్వరలోనే ఈ వృద్ధ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారు