పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 7 విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు గాను ఒకే నోటిఫికేషన్‌ను రిలీజ్ చేశారు. BELలో ఖాళీగా ఉన్న ట్రెయినీ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర తదితర పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భాగంగా భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 192 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగాలను చేయాలని చూస్తున్న వారికి ఇదొక గొప్ప అవకాశమని చెప్పవచ్చు.
BELలో మొత్తం 7 ట్రెయినీ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉండగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఫిబ్రవరి 27 వరకు గడువు ఉంది. జూనియర్ అసిస్టెంట్ (హెచ్ఆర్) పోస్టులు 12 ఖాళీ ఉండగా వీటికి ఫిబ్రవరి 25 వరకు అప్లై చేయవచ్చు. సీనియర్ అసిస్టెంట్ ఆషీసర్ (అఫిషియల్ లాంగ్వేజ్) పోస్టులు 5 ఉండగా చివరి తేదీ ఫిబ్రవరి 26. ట్రెయినీ ఇంజినీర్-1 మరియు ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టులు 70 వరకు ఉండగా చివరి తేదీ ఫిబ్రవరి 25. సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఇ-1) పోస్టులు 8 ఖాళీ ఉండగా చివరి తేదీ ఫిబ్రవరి 26. జూనియర్ అసిస్టెంట్ (హెచ్చార్) పోస్టు 1 ఉండగా చివరి తేదీ ఫిబ్రవరి 22. డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు 22 ఉండగా చివరి తేదీ ఫిబ్రవరి 24.
కోట్‌ద్వార్, ఘజియాబాద్, పంచ్‌కుల, బెంగళూరు, పూణె, నవీ ముంబై, మచిలీపట్నం, ఎస్‌బీయూ ప్రాంతాల్లో ఉన్న BEL పరిశ్రమల్లో ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు పనిచేయాల్సి ఉంటుంది. విద్యార్హత, వేతనం, ఇతర వివరాలను నోటిఫికేషన్‌ను చూసి తెలుసుకోవచ్చు. ఇందుకు గాను అభ్యర్థులు https://bel-india.in/job-notifications/ అనే సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు గాను ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.