Chintha Chiguru : చింత చిగురు అనగానే చాలామందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. తినడానికి పుల్లటి రుచిలో ఉన్నటువంటి ఈ చింత చిగురుతో వివిధ రకాల వంటలను తయారు చేసుకుని తింటాము. ఎక్కువగా వేసవి కాలంలో లభించే చింత చిగురు తినడానికి రుచి మాత్రమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చింత చిగురులో ఉన్నటువంటి విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు, ఆస్కార్బిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్ మనకు పుష్కలంగా లభిస్తాయి. అదేవిధంగా చింత చిగురులో సహజసిద్ధమైన లాక్సేటివ్ గా పని చేయడంలో దోహదపడతాయి.ఎన్నో పోషకాలు కలిగిన చింత చిగురు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారో ఇక్కడ తెలుసుకుందాం.

చింతచిగురును తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తి పుష్కలంగా లభిస్తుంది. ఇందులో డైటరీ ఫైబర్ ఉండటం చేత జీర్ణక్రియ సమస్యలు తొలగించి జీర్ణ వ్యవస్థను మెరుగు పడటానికి చింతచిగురు కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చింత చిగురుతో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
చాలామంది జలుబు, గొంతు నొప్పి,గొంతులో మంట వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యతో బాధపడే వారు చింత చిగురును ఉడికించిన నీటిని నోట్లో వేసుకుని బాగా పుక్కిలించడం వల్ల ఈ గొంతు నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడేవారు ఈ చింత చిగురు తినడం ద్వారా ఆ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. చింతచిగురును తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలను పొందవచ్చు.