ప్రముఖ సినీ నటులు, దంపతులు రాధిక, శరత్ కుమార్‌లకు షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో వారికి జైలు శిక్ష పడింది. చెన్నై స్పెషల్ కోర్టు వారికి ఏడాది జైలు విధిస్తూ తీర్పు ఇచ్చింది.
కాగా గతంలో ఆ ఇద్దరు దంపతులు పలు సినిమాలను తీశారు. అందుకు గాను ఓ సంస్థ నుంచి భారీ ఎత్తున అప్పులు తీసుకున్నారు. అయితే ఆ అప్పును వారు సకాలంలో చెల్లించలేదు. దీంతో ఆ సంస్థ వారిపై ఒత్తిడి పెంచింది. అయితే రాధిక, శరత్ కుమార్‌లు ఆ అప్పులకు గాను ఓ చెక్కు ఇచ్చారు. కానీ ఆ చెక్కు బౌన్స్ అయింది. దీంతో ఆ సంస్థ వారిపై కేసు పెట్టగా కోర్టు విచారించి వారు చేసింది నేరమేనని అంగీకరించింది. ఈ క్రమంలో వారికి ఏడాది పాటు జైలు శిక్షను విధించారు.
అయితే రాధిక, శరత్‌కుమార్‌లకు జైలు శిక్ష పడడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. వారి కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం విదితమే. ఇటీవలే విడుదలైన రవితేజ క్రాక్ మూవీలో జయమ్మగా ఆమె ఆకట్టుకుంది.