Renu Desai : రేణు దేశాయ్.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అప్పట్లో తన సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు, తన అభిమానులకు ఆమె దగ్గరగా ఉంటోంది. ఇక సుమారు 20 సంవత్సరాల అనంతరం రేణు దేశాయ్ మళ్లీ ఇటీవలే టైగర్ నాగేశ్వర్ రావు అనే మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఈమె హేమలతా లవణం అనే పాత్రలో నటించి అందరి ప్రశంసలు పొందింది.
అయితే ఈ సినిమా తరువాత ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందని భావించారు. కానీ అలా జరగడం లేదు. తాను తదుపరి ఏ మూవీలో నటించబోతున్నాను అనే విషయంపై రేణు దేశాయ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే నిత్యం సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటోంది. ఇక సోషల్ మీడియాలో ఆమె తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను అన్నింటినీ కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో ఎంతో ప్రేమగా ఉంటుంది. వారికి సంబంధించిన విషయాలను ఆమె తన సోషల్ ఖాతాల ద్వారా తెలియజేస్తుంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. తన పిల్లల ఫొటోలు, వీడియోలను ఆమె షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా వారి గురించి రేణు దేశాయ్ ఒక ఎమోషనల్ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె కేరళ వెకేషన్‌లో ఉండగా, ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
రేణు దేశాయ్ పిల్లలు అకీరా నందన్, ఆద్యలు కేరళలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకీరా నందన్ పియానో వాయించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక అకీరా నందన్ హీరోగా త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి కూడా. అయితే దీనిపై అటు పవన్, ఇటు రేణు ఎవరూ స్పందించలేదు. ఇక తన పిల్లల గురించి రేణు ఇలా రాసుకొచ్చింది. వాళ్లకు నేను జీవితాన్ని ఇచ్చానా, లేదంటే వాళ్లు నాకు పుట్టడం వల్ల నాకు తిరిగి పునర్జన్మ ఇచ్చారా, అన్నది అర్థం కావడం లేదు, నా పిల్లలను చూసి ఒక్కోసారి నేనే ఆశ్చర్యపోతుంటాను.. అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది రేణు దేశాయ్. ఈ నేపథ్యంలోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక నెటిజన్లు సైతం మీరు నిజంగా చాలా గ్రేట్ మేడమ్, పిల్లలను బాగా పెంచుతున్నారు.. అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా రేణు త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.