తెలుగు ఇండస్ట్రీలో కాంట్రవర్సి దర్శకుడు ఎవరంటే అందరికీ టక్కున రామ్ గోపాల్ వర్మ గుర్తొస్తారు. కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అని చెప్పవచ్చు. ఆయన తీసే సినిమాలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ఆయన చేసే ట్వీట్ లు కూడా తీవ్ర దుమారం రేపుతుంటాయి. సోషల్ మీడియాలో ఎప్పుడు వివాదాస్పద, వ్యంగ్య కామెంట్ చేస్తూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా మరోసారి తనదైన శైలిలో స్పందించి వార్తల్లో నిలిచారు.
తాజాగా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా తన పుట్టినరోజు గురించి తెలియజేస్తూ…”ఇవాళ నా పుట్టిన రోజు కాదు… వాస్తవానికి నా డెత్ డే.. ఎందుకంటే నా ఆయుష్షులో ఒక ఏడాది తగ్గిపోయింది” అంటూ ఏడుపు ఎమోజి పెడుతూ ట్వీట్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ తన పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా ట్వీట్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది. వర్మ చేసిన ఈ పోస్ట్ ని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఎంతైనా ఆర్జివి నీ రూటే సపరేటయ్యా అంటూ కామెంట్ చేయగా, మరి కొందరు ఈ వయసులో ఇలాంటి మాటలు అవసరమా వర్మ అంటూ కామెంట్లు పెడుతున్నారు