సాధారణంగా సినిమా సెలబ్రిటీలు బయట కనిపిస్తే అభిమానుల పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వారితో సెల్ఫీలు దిగడానికి ఎగబడుతుంటారు. ఈ విధంగా అభిమానులు చూపే ప్రేమ కొన్నిసార్లు సెలబ్రెటీలను తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. అచ్చం ఇలాంటి పరిస్థితి తమిళనటుడు అజిత్ కి ఎదురయింది.
ఈరోజు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉదయం నుంచి ఎంత ప్రశాంతంగా జరిగాయి. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిని చూసి అభిమానులు వారితో ఫోటోలు దిగడానికి చూపిన ఉత్సాహం నటుడు అజిత్ కు కొంత ఇబ్బందిని కలుగజేసింది. అజిత్ తన భార్యతో కలిసి తన ఓటును వినియోగించుకోవడానికి రాగ అభిమానులు ఎగబడటంతో ఇబ్బంది పడ్డారు.
భార్య షాలినీతో కలిసి అజిత్ తిరువాన్మయూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాదారణ వ్యక్తిలా క్యూలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే అభిమాని అత్యుత్సాహంతో సెల్ఫీ తీసుకోవడం కోసం ప్రయత్నించగా అజిత్ ఫోన్ లాక్కొని అభిమానికి వార్నింగ్ ఇచ్చారు తర్వాత ఓటు వేసి వెళ్లే సమయంలో అతని ఫోన్ అతనికి తిరిగి ఇచ్చారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.