Australia Cricket Team 2023 : వన్డే ప్రపంచ కప్ 2023 లో ఆస్ట్రేలియా కి కలిసి రావట్లేదు. ఐదు సార్లు వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఆటతీరులో తడబడుతోంది. భారత్ చేతిలో మొదటి మ్యాచ్ లోనే ఓటమిపాలైంది. రెండవ మ్యాచ్ లో కూడా ఓటమి తప్పులేదు. అయితే వరల్డ్ కప్ అంటే ఆస్ట్రేలియా ఓ లెక్కలో ఆడుతుంది. కానీ, ఇంతలా దిగజారిపోయిందేంటని, అంతా అంటున్నారు. ఆస్ట్రేలియా ఎంత బలంగా బౌలింగ్ చేస్తుందో, అంతే బలంగా బ్యాటింగ్ కూడా చేస్తుంది. 300 టార్గెట్ ని కూడా ఈజీగా రీచ్ అయిపోయేది ఆస్ట్రేలియా. కానీ, ఇప్పుడు 200 పరుగులు చేయడమే కష్టంగా మారిపోయింది.
అయితే, ప్రధాన కారణం ఏంటంటే ఓపెనర్ అయిన ట్రావిస్ హెడ్. గాయం కారణంగా, మ్యాచ్ కి దూరమయ్యాడు హెడ్. అతను లేకపోవడంతో గేమ్ పై పెద్ద ప్రభావం పడుతోంది. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఓపెనర్లుగా వస్తున్నారు. కానీ, ఒకటి రెండు ఓవర్లకే అవుట్ అయిపోతున్నారు. టీమిండియా పై వార్నర్ ఏదో 41 పరుగులు చేశారు. కానీ, దక్షిణాఫ్రికా పై 13 పరుగులకే అవుట్ అయిపోయారు. పైగా వికెట్ కీపర్ బ్యాటర్ లేడు. ఒకప్పుడు ఆడం గిల్ క్రిస్ట్, ఇయాన్ హీలి లాంటి వికెట్ కీపర్ బాటర్ లని ప్రపంచానికి ఆసీస్ పరిచయం చేసింది.
కానీ, ఇప్పుడు ఆ స్థాయి కీపర్ లు లేరు. వికెట్ కీపర్ బ్యాటింగ్ పరంగా ఫుల్లుగా నిరాశ పరుస్తున్నారు. అలానే, ఈ జట్టుకు సిక్సర్లు లేవు సరి కదా.. ఫోర్స్ కూడా లేవు. ఫినిషింగ్ కూడా, అస్సలు ఆస్ట్రేలియా కి దొరకట్లేదు. ఫస్ట్ మ్యాచ్లో గ్రీన్ దారుణంగా విఫలమయ్యారు. స్టయినిష్ ని తర్వాత గ్రీన్ స్థానంలో పెడితే, ఐదు పరుగులు మాత్రమే చేసి, అవుట్ అయిపోయాడు.
ఇలా విఫలం అవ్వక తప్పట్లేదు. ఫీల్డింగ్ లో కూడా యాక్టివ్ గా వుండే క్రికెటర్లు ఈ విషయం లో కూడా, నిరాశనే మిగులుస్తున్నారు. ఇది వరకు వీళ్ళు అద్భుతమైన క్యాచ్ లని పట్టడంని మనం చూసాం. కానీ, ఆసీస్ ఫీల్డింగ్ లో దారుణంగా ఉంది. నాలుగు ఈజీ క్యాచ్ లని కూడా డ్రాప్ చేసేసారు. ఇలా అన్నిట్లో కూడా, ఆస్ట్రేలియా వెనకే ఉంది. ఓటమి అయితే తప్పట్లేదు.