Multani Mitti : చాలామంది అందాన్ని పెంపొందించుకోవడానికి చూస్తూ ఉంటారు. అనేక రకాల చిట్కాలని పాటిస్తూ ఉంటారు. అందాన్ని మీరు కూడా పెంపొందించుకోవాలనుకుంటున్నారా..? మచ్చలు, మొటిమలు వంటి వాటి నుండి దూరంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే వీటిని కచ్చితంగా పాటించండి. మొటిమలు ఒక్క రోజులో తొలగిపోవాలంటే, ఈ చిట్కాలు మీకు బాగా ఉపయోగ పడతాయి. ఇలా చేసినట్లయితే, మొటిమలు ఉండవు.
దీని కోసం ముందు ఒక చిన్న బౌల్ తీసుకొని, అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ముల్తానా మట్టిని వేసుకోండి. అందులోనే గంధం పొడి, రెండు చుక్కల అల్లం జ్యూస్ కూడా వేసుకోండి. ఇందులోనే కోడిగుడ్డు తెల్ల సొన, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి పేస్ట్ కింద చేసుకోవాలి. దీనిని బాగా బ్రష్ సహాయంతో ముఖానికి పట్టించాలి.
ఈ ఫేస్ ప్యాక్ ని మీరు 20 నిమిషాల పాటు ఉంచుకుని, తర్వాత గోరు వెచ్చని నీటి తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. ముఖం కాంతివంతంగా ఉంటుంది. అందంగా మారుతుంది. కొన్ని తులసి ఆకులు, పుదీనా ఆకులు తీసుకుని, కొన్ని చుక్కల నీళ్లు వేసి పేస్ట్ కింద చేసుకోండి.
దీనిని మీరు ముఖానికి బాగా పట్టించి, 30 నిమిషాల పాటు వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ కూడా బాగా ఉపయోగ పడుతుంది. వారానికి రెండు సార్లు మీరు ఈ రెండు ఫేస్ ప్యాక్ లని ట్రై చేయొచ్చు. పసుపులో రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసుకుని, ముఖానికి పట్టించి ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే కూడా బాగుంటుంది. ఇలా ఈజీగా మీరు మీ అందాన్ని పెంపొందించుకోవచ్చు. మచ్చలు, మొటిమలు వంటివి ఏమీ లేకుండా ఉండొచ్చు.