గత నెల 24వ తేదీన అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో కేవలం కనురెప్పపాటు కాలంలో 12 అంతస్థుల భవనం నేలమట్టమైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 24 మంది మృతి చెందగా ఇంకా 121 మంది ఆచూకీ లభించాల్సి ఉంది.ఉత్తర మియామీ సమీపంలోని 12 అంతస్తుల నివాస భవనం జూన్ 24 తెల్లవారుజామున కూలిపోగా మిగిలిన భవన శిథిలాలను బాంబుల సహాయంతో కూల్చివేశారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 24 మంది మరణించినట్లు అధికారులు గుర్తించగా మరియు 121 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.అయితే ఈ భవనం కూలిపోవడానికి కారణాలను పరిశీలించగా ఈ భవనంలో కొన్ని రోజుల కిందట పగుళ్లను గుర్తించినట్లు ఇంజనీర్లు తెలియజేశారు. వాటికి త్వరలోనే మరమ్మతులు చేయాల్సి ఉండగా ఇంతలోనే ఈ విధమైనటువంటి ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలియజేశారు.
WATCH: The portion left standing of the partially collapsed Champlain Towers South condo building in Surfside, Florida, was demolished.https://t.co/ssfxO7WmMN pic.twitter.com/hKOS0nAr4e
— CBS 21 News (@CBS21NEWS) July 5, 2021
ఈ క్రమంలోనే వచ్చే వారంలో ఎల్సా తుఫాన్ కారణంగా సర్ఫ్‌సైడ్‌లోని మిగిలిన 12-అంతస్తుల చాంప్లైన్ టవర్స్ సౌత్‌ను అక్కడి కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి 10:30 తర్వాత బాంబులతో ఆ భవనాన్ని కూల్చివేశారు. ఈ భవనాన్ని కూల్చివేసే సంఘటనను చూడటానికి అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు.ప్రస్తుతం ఈ భవనం కూల్చివేస్తున్నటువంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.