తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటు సినిమాల పరంగాను, అటు రాజకీయాల పరంగాను ఎంతో ఉన్నత కుటుంబంగా చెప్పవచ్చు.ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు.అయితే ఇప్పుడు సడన్ గా మెగా వారసుడు రామ్ చరణ్ తేజ్ కూడా రాజకీయాలలోకి రానున్నారు.అయితే ఇది నిజ జీవితంలో అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే.. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
శంకర్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేవిధంగా ఇప్పటి నుంచే చరణ్ పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చి దిద్దుతున్నారు దర్శకుడు శంకర్.శంకర్ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా చెర్రీ జీవితంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలచాలని శంకర్ తాపత్రయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి కాంబోలో రాబోయే సినిమాలో ఆసక్తికర పాయింట్ ఇదే అంటూ ఓ క్రేజీ ఈ విషయాన్ని బయటపెట్టారు.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ మొదటిగా పోలీస్ వృత్తిలో కనిపించనున్నారు. పోలీస్ గా ఉన్న చరణ్ సడన్ గా రాజకీయాలలోకి అడుగు పెట్టి ఈ వ్యవస్థను మార్చే వ్యక్తిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇదే బిగ్ ట్విస్ట్ అంటూ ఈ విషయం సోషల్ మీడియాలో పెద్దఎత్తున చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో వేచి చూడాలి. ఇకపోతే శంకర్ చరణ్ కాంబోలో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.