JIPMAT 2021: మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (JIPMAT) 2021లో భాగంగా జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్లకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత ఉన్న అభ్యర్థులు jipmat.nta.ac.in అనే సైట్‌లో అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఐఐఎం బోధగయ, ఐఐఎం జమ్మూలలో అందుబాటులో ఉన్న 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌కు అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ లోగా దరఖాస్తు చేయవచ్చు.
JIPMAT 2021 పరీక్షను జూన్ 20న కంప్యూటర్-బేస్డ్ మోడ్‌లో నిర్వహిస్తారు. మే 5 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు అప్లికేషన్లలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.
JIPMAT 2021: ఇలా అప్లై చేయండి..
స్టెప్ 1 : ఇంటర్నెట్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి jipmat.nta.ac.in అనే సైట్‌లోకి వెళ్లాలి.
స్టెప్ 2: JIPMAT 2021- New Registration అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 3: పేజీలో ఇచ్చిన నిబంధనలను చదవండి. తరువాత కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ముందుకు సాగండి.
స్టెప్ 4: అవసరం ఉన్న వివరాలను ఎంటర్ చేసిన తరువాత పాస్‌వర్డ్‌ను జనరేట్ చేయాలి.
స్టెప్ 5 : సెక్యూరిటీ ప్రశ్నను ఎంచుకుని సమాధానం ఇవ్వాలి.
స్టెప్ 6: అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి. స్కాన్ చేసిన ఫొటో, సంతకం, ఇతర పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 7: నిర్దేశించిన ఫీజును చెల్లించాలి. తరువాత వచ్చే అక్‌నాలెడ్జ్‌మెంట్‌ను ప్రింట్ తీసుకోవాలి.
JIPMAT 2021: అప్లికేషన్ ఫీజు
జిప్‌మ్యాట్ 2021 అప్లికేషన్ ఫీజును రూ.2వేలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, అంగవైక్యలం ఉన్నవారు, ట్రాన్స్ జెండర్లు రూ.1000 చెల్లించాలి.
JIPMAT 2021: అర్హత
గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి చదివిన వారు లేదా 2 ఏళ్ల ప్రీ యూనివర్సిటీ ఎగ్జామ్ రాసిన వారు లేదా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామ్ రాసిన వారు లేదా స్టేట్ ఓపెన్ బోర్డులో విద్యను అభ్యసించిన వారు దరఖాస్తు చేయవచ్చు.
JIPMAT 2021: పరీక్ష విధానం
పరీక్షలో 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్ ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, వర్బెల్ ఎబిలిటీలలో ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. తప్పుగా సమాధానం ఇస్తే 1 మార్క్ తగ్గిస్తారు.