సాధారణంగా మనం సినిమాలో చూస్తుంటాము. నేనే దేవుడిని… నేను చెప్పినదే శాసనం అంటూ పలు సినిమాలలో కొన్ని సన్నివేశాలను చూస్తుంటాము. అచ్చం అలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. న్యూసౌత్ వేల్స్ పోలీసులు లైవ్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండగా అక్కడికి ఒక అపరిచితుడు “ఈ భూమిని సృష్టించింది నేనే… నేనే సృష్టికర్తను” అంటూ లోపలికి దూసుకు వచ్చాడు. ఉన్నఫలంగా అతనిని చూసిన పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
పొడవాటి జుట్టు కలిగి, బ్లాక్ బ్లేజర్ ధరించిన ఆ వ్యక్తి కమిషనర్ మైక్ ఫుల్లెర్‌కి కొన్ని మీటర్ల దూరంలో నిలబడి నా లేఖను అందుకున్నావా ..అంటూ కమిషనర్ ను ప్రశ్నించడంతో కమిషనర్ ఒక్కసారిగా కంగు తిన్నారు. ఆ వ్యక్తి అలా అడగడంతో ఏం చెప్పాలో అర్థం కాక తీవ్ర అయోమయంలో ఉన్నారు.
https://twitter.com/stivl_/status/1409331206127112192?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1409331206127112192%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Ftrending%2Fviral-video-man-declared-that-he-is-the-prime-creator-of-this-earth-in-a-police-press-briefing-finally-this-is-what-happened-watch-video-nk-933928.html
ఇంతలోనే కమిషనర్ దగ్గరికి వచ్చి కొన్ని కాగితాలను అతని చేతిలో పెట్టాడు.ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఇతను ఎవరు పిచ్చోడి మాదిరిగా ఉన్నాడని పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి బయటకు లాక్కెళ్లారు.