నిరుద్యోగులకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలోనే బెంగుళూరులో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్ లో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2021 -22 ఈ సంవత్సరం కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక దరఖాస్తు చేసుకోవడానికి కేవలం రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 2021 జూన్ 30వ తేదీ ఆఖరి గడువు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు https://www.bel-india.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. కెరీర్స్ సెక్షన్‌లో నోటిఫికేషన్లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.