ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేశారు. అదేవిధంగా వాతావరణం కూడా కాస్త చల్లబడటంతో చాలామంది ఏదైనా ప్రాంతాలకు టూర్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ విధంగా టూర్ ప్లాన్ చేసిన ఓ జంటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపై టూర్ ప్లాన్ చేసే వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియో చూడాల్సిందే..
ఈ వీడియోలో ఓ జంట రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో టూరిజం వెళ్లారు. ఈ విధంగా వెళ్లిన ఈ జంట తమ కారును రోడ్డు పక్కన ఆపి పచ్చని వాతావరణంలో సెల్ఫీ తీసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న కొందరు యువకులు వారి వాహనాలను పక్కగా ఆపి ఆ జంట వద్దకు చేరుకున్నారు.అయితే అక్కడికి వెళ్ళిన యువకులు కత్తులు చూపెడుతూ వారి వద్ద ఏ వస్తువులు అయితే ఉన్నాయో అవన్నీ ఇవ్వాల్సిందిగా కోరారు. వారి దగ్గర ఏమీ లేవని చెప్పడంతో వారు కారు తాళాలు తీసుకుని కారులో విలువైన వస్తువుల కోసం వెతికారు.
ये आज का राजस्थान है । सरे आम चाकू की नोक पर , अपराधी बेख़ौफ़ लुट रहें हैं । ये बेशर्म घटना उदयपुर की है , पर शर्म आपको नहीं आएगी @RahulGandhi जी ? pic.twitter.com/vY5jEdULwy
— Laxmikant bhardwaj (@lkantbhardwaj) June 12, 2021
కారులో ఏమీ లేక పోవడంతో వారి ఒంటిపై ఉన్న గొలుసులు, ఉంగరాలు తీసుకువెళ్లారు. అదేవిధంగా కారు తాళాలు కూడా లాక్కున్నారు. కనీసం కారు తాళాలు అయిన ఇవ్వమని సదరు మహిళ అడిగినప్పటికీ ఆ యువకులు కారు తాళాలు ఇవ్వకుండా వెళ్లారు. అయితే ఈ తతంగం మొత్తం మహిళ వీడియో చిత్రీకరించినా యువకులు ఏ మాత్రం భయపడకుండా వారి పై ఈ విధంగా దోపిడీకి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.