వివాహ వేడుకలు అంటేనే ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. కోలాహలంగా, సందడిగా ఉంటుంది. పెళ్లి తంతులో అందరూ ఎంజాయ్ చేస్తారు. కానీ కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకుల పట్ల కొందరు అదోలా ప్రవర్తిస్తారు. దీంతో అందరి ఎదుట అభాసుపాలవుతుంటారు. సరిగ్గా ఓ వ్యక్తికి కూడా ఇలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఓ వివాహ వేడుకల్లో వధూవరులిద్దరూ పూలమాలలు మార్చుకునేందుకు రెడీగా ఉన్నారు. అంతలో ఓ వ్యక్తి వచ్చి వరున్ని చేతుల్తో పైకి ఎత్తాడు. దీంతో వధువు అతని మెడలో పూలమాల వేయలేకపోయింది. కానీ అంతలోనే ఇంకో వ్యక్తి వచ్చి వధువును పైకి ఎత్తాడు. దీంతో ఆమె సులభంగా వరుడి మెడలో మాల వేసింది. కానీ మాల వేశాక కిందకు దించగానే ఆమె తనను ఎత్తుకున్న వ్యక్తిని చెంప దెబ్బ కొట్టింది. ఆమె అనుమతి లేకుండానే ఆమెను పైకి ఎత్తాడని, అందుకనే ఆమె చెంప దెబ్బ కొట్టిందని వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. దీంతో వరుడు నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు.
தவறி விழுற வீடியோ இல்லை..
புருஷன் மைன்ட் வாய்ஸ் என்னவாயிருக்கும் என்பதை சொல்லவும் pic.twitter.com/wDNmDLXEVa— ஞானக்குத்து (@Gnanakuthu) July 2, 2018
కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇది పాతదే అయినా మరోమారు వైరల్ అవుతోంది. వధువును ఎత్తినందుకు చెంప దెబ్బ తిన్న ఆ వ్యక్తి అక్కడి నుంచి ఎమోషనల్‌గా పక్కకు పోయాడు. అయితే.. ఆ వ్యక్తి నిజానికి అలా ప్రవర్తించకూడదు. ఒకరి అనుమతి లేకుండా అలా చేయరాదు. అందుకనే అతను అలా చెంప దెబ్బ తినాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఈ సంఘటన అతనికి చేదు జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం.