ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ వీడియోలు ఏస్థాయిలో పాపులర్ అయ్యాయో మనకు తెలిసిందే. అయితే
ఈజిప్ట్ దేశాల్లో సోషల్ మీడియాపై కఠిన ఆంక్షలు ఉంటాయి. ఆ దేశ సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం ఏమాత్రం వెనక కాదు. తాజాగా టిక్ టాక్ స్టార్ హనీన్ హోసం’కు ఈజిప్టు కోర్ట్ 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
హనీన్ పై ఉన్న మానవ అక్రమ రవాణా కేసులో ఆమెకు ఈజిప్ట్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆమె ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని, కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ శిక్ష నుంచి తనని ఎలాగైనా కాపాడాలని ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ వేడుకుంది. ఈ క్రమంలోనే హనీన్ మాట్లాడుతూ…
ప్రెసిడెంట్ సాబ్ మీ కూతురు ఏం పాపం చేసింది.. చచ్చిపోతోంది. చచ్చిపోతున్న మీ కూతుర్ని మీరే కాపాడాలి. ఈ కేసులో నా తప్పు లేదు ఈ కేసును తిరిగి విచారించాలి. నేను జైలుకు వెళ్తే నా తల్లి గుండె ఆగి చచ్చిపోతుంది ఎలాగైనా నన్ను ఈ కేసు నుంచి కాపాడండి అంటూ కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.