పల్లెటూరు కు చెందిన ఓ అమ్మాయి తన మధురమైన స్వరంతో పాట పాడగా ఆ పాటకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు.ఆమె గాత్రం కేవలం కేటీఆర్ ని మాత్రమే కాకుండా సంగీత దర్శకులు ఎస్.ఎస్ తమన్ దేవిశ్రీ ప్రసాద్ సైతం మంత్రముగ్ధులను చేసింది. ఆమె పాటను విన్న సంగీత దర్శకులు తాము నిర్వహించబోయే కార్యక్రమాలలో తప్పకుండా తనకు అవకాశం కల్పిస్తామని సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
మెదక్ జిల్లాకు చెందిన నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి అనే అమ్మాయి అధ్భుత గాయని. తన అద్భుతమైన గాత్రానికి ఫిదా అయిన నెటిజన్ సరేంద్ర తిప్పరాజు ఆ వీడియోని ట్విటర్ వేదికగా కేటీఆర్‌కు షేర్ చేశారు. ఈ విధంగా వీడియోను షేర్ చేసిన నెటిజన్ మెదక్ జిల్లాలోని ఒక గ్రామంలో ఆణిముత్యం ఉంది. మీ సహకారం ఆశీస్సులు తనకు కావాలని తను పాడిన పాటకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. శ్రావణి పాడిన ఈ పాటకు ఫిదా అయిన మంత్రి కేటీఆర్ ఆ వీడియోను సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్ లకు ట్యాగ్ చేశారు.
Dear KTR garu, yesterday discovered a jewel in our village Naraingi, Medak Dist on unplanned visit. Brilliant singer, name Sharvani. D/o of Lakshamana Chary. Her voice is mesmerising. Need to support her talent with right contact from Arts & your blessings – Namaste pic.twitter.com/V7meCO7EAG
— Surendra tipparaju (@surentips) June 24, 2021
ఈ పాటను విన్న సంగీత దర్శకుడు తమన్ ఆమె ఒక అద్భుతమైన గాయని అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఆమె పాటకు స్పందిస్తూ ఆమె గాత్రానికి ఫిదా అయినట్లు చెప్పడమే కాకుండా.. ఇంత ప్రతిభావంతురాలిని తమ దృష్టికి తీసుకు వచ్చినందుకు మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అంతేకాకుండా భవిష్యత్తులో తాను నిర్వహించబోయే కార్యక్రమాలలో తప్పకుండా తనకు అవకాశం కల్పిస్తానని ఈ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్ తెలియజేశారు.