కరోనా నేపథ్యంలో బాధితులకు నటుడు సోనూసూద్ ఏ విధంగా సహాయం చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. అయితే బయటి వారికే అంత చేసిన వాడు తన కుమారుడిని ఏవిధంగా చూసుకుంటాడో అర్థం చేసుకోవచ్చు. అందుకనే సోనూసూద్ తన కొడుక్కి ఏకంగా రూ.3 కోట్ల విలువైన ఓ లగ్జరీ కారును గిఫ్ట్‌గా అందించాడనే ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే దీనిపై సోనూసూద్ స్పందించాడు.
ఫాదార్స్ డే సందర్భంగా తన కుమారుడు ఇషాన్‌కు రూ.3 కోట్ల విలువైన లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు.. అన్న వార్తలపై స్పందించిన సోనూసూద్ మాట్లాడుతూ కారును ట్రయల్ వేసేందుకు ఇంటికి తీసుకొచ్చిన మాట వాస్తవమే కానీ.. దాన్ని తన కొడుక్కి గిఫ్ట్‌గా ఇవ్వలేదని సోనూసూద్ తెలిపాడు.
అయినా ఫాదర్స్ డే సందర్భంగా తనకే తన కొడుకు గిఫ్ట్‌లు ఇవ్వాలి కానీ.. తాను తన కొడుక్కి ఎలా గిఫ్ట్ ఇస్తానని సోనూ అన్నాడు. అయితే ఈ వార్త వైరల్ అయినప్పటికీ చాలా మంది తనకు మద్దతు ఇస్తూ మాట్లాడడం సంతోషంగా ఉందని సోనూసూద్ తెలిపాడు.