టీవీ యాంకర్ గా, తన అందచందాలతో పలు షో లలో సందడి చేసిన జబర్దస్త్ బ్యూటీ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకరింగ్, పలు సీరియల్స్ లో నటిస్తున్న వర్షన్ జబర్దస్త్ కార్యక్రమంలో కూడా ఇమ్మానియేల్ కి జోడి కట్టారు. పలు కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా ఉన్న వర్ష సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేస్తుంటారు.
తాజాగా వర్ష చేతికి ఉంగరం ధరించిన ఫోటోను షేర్ చేస్తూ జూలై 4 తేదీన ఒక ముఖ్యమైన విషయం తెలియజేయబోతున్నాను అంటూ వెల్లడించారు. అదేవిధంగా చేతిలో తాళి పట్టుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తాళిబొట్టును షేర్ చేయడమే కాకుండా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఎమోజీలను జత చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వర్ష షేర్ షేర్ చేసిన ఫోటోలను చూసిన నెటిజన్లు వర్ష త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. చేతికి ఉంగరం ధరించి ఉంది అంటే ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. వర్ష మెడలో తాళి పడితే ఇమ్మానియేల్ పరిస్థితి ఏమిటి? అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే వర్ష ఈ విధంగా ఫోటోలలో షేర్ చేయడం వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలియాలంటే నాలుగో తేదీ వరకు ఎదురు చూడాల్సిందే.